దేశీయంగా రిటెయిల్ ద్రవ్యోల్బణం పెరిగింది. సెప్టెంబరులో వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఆగస్టులో ఇది 4.83 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం అధికమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి కేంద్రం కొత్త విధానంలో ద్రవ్యోల్బణ గణాంకాలను విడుదల చేస్తోంది.
వ్యాపారం
5.54 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం


