హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్జీవో, మీడియా పేరుతో మోసాలు.. అరెస్ట్!

అన్నమయ్య: మదనపల్లెలో ఎన్జీవో, మీడియా ప్రతినిధినంటూ ప్రజలను మోసం చేసి, డబ్బులు ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతున్న షేక్ సయ్యద్ మీర్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి కారు, మూడు నకిలీ గుర్తింపు కార్డులు, విజిటింగ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.