హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాలయాల్లో పటిష్ట జాగ్రత్తలు చేపట్టాలి: జేసీ

ATP: దసరా నవరాత్రుల సందర్భంగా దేవాలయాల్లో పటిష్ట జాగ్రత్త చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా భక్తుల భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, సీసీ కెమెరాలు, మెరుగైన పారిశుధ్యం కల్పించాలన్నారు. ప్రధాన ఆలయాల్లో పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు.