హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్టాండ్ కోసం యువత పోరాటం

ASR: మారేడుమిల్లి మండల కేంద్రంలో గత 15 ఏళ్లుగా బస్ కాంప్లెక్స్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామ యువత దీక్షకు దిగారు. బస్ కాంప్లెక్స్ నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.