హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రచందనం స్మగ్లింగ్.. ఆరుగురు అరెస్ట్

KDP: కాశినాయన మండలం సావిశెట్టిపల్లె అటవీ ప్రాంతం సమీపంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 70 ఎర్రచందనం దుంగలతో కూడిన కంటైనర్‌తో పాటు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి, వాహనాలను పోరుమామిళ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.