హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో సోమవారం 75 మంది బాధిత కుటుంబాలకు రూ.60 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంతోపాటు మానసిక ధైర్యాన్ని అందిస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.