హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్తిపాడులో తాగునీటి పనులకు శ్రీకారం

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తాగునీటి సదుపాయాల కోసం రూ.33.67 కోట్లతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు శంకుస్థాపన చేశారు. జలజీవన్‌ మిషన్‌ కింద 122 పనులు చేపట్టినట్లు తెలిపారు. వీటిలో 56 పూర్తయ్యాయని, 39 పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.