NTR: నందిగామ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సౌమ్య సోమవారం రాఘవపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ శాశ్వత భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భవన నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వేగంగా భవన నిర్మాణం పూర్తి చేయాలి'


