హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్లపాలెంలో హెల్త్ సెంటర్ ప్రారంభం

BPT: కర్లపాలెం పీహెచ్‌సీలో రూ.50 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ సెంటర్‌ను ఎమ్మెల్యే నరేంద్రవర్మ రాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధునిక ల్యాబ్ సౌకర్యాలు ఇక్కడ ఉంటాయని, పేదలు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లకుండా ఇక్కడే ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.