హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతు రుణాలు వెంటనే మాఫీ చేయాలి'

KDP: రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, వారిని అప్పుల ఊబి నుంచి కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని మాజీ ఎంపీ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పులపాలవుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.