KRNL: కల్లూరు అర్బన్ పరిధిలోని 34వ వార్డు శ్రీనివాస నగర్‌లో రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీనివాస నగర్‌లో సీసీ రోడ్లు పనులకు భూమిపూజ


