హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BPT: చీరాల మండలం గొల్లపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం 'పులిపాటి పెట్రోల్ బంక్'ను చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ నిర్వహణ, వినియోగదారుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఇంధన నాణ్యత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.