HYD: సైబర్ నేరగాళ్ల మోసాల ద్వారా దోచుకున్న డబ్బును మళ్లించేందుకు మ్యూల్ ఖాతాలను వాడుతున్నారు. కమీషన్ ఆశజూపి లేదా ఉద్యోగాల పేరుతో అమాయకులను నమ్మించి వారి బ్యాంక్ ఖాతాలను వాడుకుంటున్నారు. నేరపూరిత సొమ్ము చేతులు మారడానికి ఇవి దోహదపడతాయని, కాబట్టి, ఎవరికీ మీ బ్యాంక్ వివరాలు ఇవ్వకండని HYD పోలీసులు 'X' వేదికగా తెలిపారు. తెలిసీ తెలియక ఇందులో భాగస్వాములు కాకండని కోరారు.
తెలంగాణ
మ్యూల్ ఖాతాల పట్ల అప్రమత్తత అవసరం!


