హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప కార్పొరేషన్‌కు CITU హెచ్చరిక

KDP: మృతిచెందిన, పదవీ విరమణ చేసిన మున్సిపల్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని CITU నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అదనపు కార్మికులకు నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.