హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కొణిదెల నాగబాబు పర్యటన

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు మంగళవారం నాగాయలంక మండలం సంగమేశ్వరం రానున్నారు. ప్రజా ప్రగతి సేవా సంఘం ఆధ్వర్యంలో సముద్ర తీరంలో మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి మడ మొక్కలు నాటుతారు. అనంతరం అశ్వారావుపాలెంలో మండలి వెంకట కృష్ణారావు విగ్రహాన్ని, మినీ పార్కును ప్రారంభిస్తారు.