మార్కాపురం జిల్లా కేంద్రంలోని కోర్టు కూడలిలో సోమవారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. తౌషిక్ హత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని, మౌలాబి ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జరిగిన ఈ ధర్నాలో జలదంకి నర్సింగరావు, దమ్ము వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'హత్య కేసు నిందితులను అరెస్టు చేయాలి'


