హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాలలో అడ్డగోలు పార్కింగ్.. ట్రాఫిక్ కష్టాలు

GDWL: జిల్లాలోని పాత కూరగాయల మార్కెట్ సమీపంలో అడ్డగోలు పార్కింగ్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హోల్‌సేల్ దుకాణాల వద్ద రహదారిపైనే వాహనాలు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు ఆటంకాలు కలగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.