హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ ఆఫీసు వద్ద మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్‌ల కొరకు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జీతాలు పెంచాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, మహిళా కార్మికుల సమస్యలపై ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయాలి, మరణించిన రిటైర్మెంట్ అయినా కార్మిక బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాలి తదితర డిమాండ్‌లపై ఆందోళన చేశారు.