NRML: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆలయ ఈవో అంజనా దేవి ఆదేశాలతో వాగ్దేవి, హుడా సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు. 100 గదుల అద్దె వసతి ప్రాంగణంలో పిచ్చిమొక్కలను తొలగించారు. భక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం తాగునీటి కుళాయిల వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టారు.
తెలంగాణ
బాసర ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు


