హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ టెన్త్ పరీక్షలు ప్రశాంతం.. తొలిరోజు 109 మంది హాజరు

BDK: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈవో శంభుప్రసాద్ తెలిపారు. ఇంటర్మీడియట్‌లో 47 మంది అభ్యర్థులకు గాను 40 మంది పరీక్ష రాయగా, ఏడుగురు గైర్హాజరయ్యారు. పదో తరగతిలో 90 మందికి గాను 69 మంది హాజరుకాగా, 21 మంది పరీక్షకు హాజరు కాలేదని అన్నారు.