హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరు పోలీస్ స్టేషన్‌లో దసరా పూజలు

NTR: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరువూరు పోలీస్ స్టేషన్‌లో రెండో రోజు అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించారు. ఎస్సై శాతకర్ణి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతియుత వాతావరణంలో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.