హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు కరువు!

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 మీదుగా వెళ్లే కడప–చెన్నై ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. రద్దీగా ఉండే ఈ మార్గంలో స్పీడ్ బ్రేకర్లు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి పనుల్లో భాగంగా గతంలో ఉన్న స్పీడ్ బ్రేకర్లను తొలగించారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.