హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముడా పీఠం కోసం జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేల పట్టు

MBNR: జిల్లాలో ముడా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవుల భర్తీపై కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. ముడా చైర్మన్ పదవిని తమ నియోజకవర్గానికి కేటాయించాలని ఎమ్మెల్యేలు జి. మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం. నవీన్ గౌడ్‌కు పదవి ఇప్పించేందుకు జీఎంఆర్ ప్రయత్నిస్తుండగా, జడ్చర్లకు అవకాశం ఇవ్వాలని అనిరుధ్ రెడ్డి కోరుతున్నట్లు తెలుస్తోంది.