హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పించాలి'

SKLM: కొత్తూరు (M) పారాపురం గ్రామ దళితుల స్మశానవాటికకు రహదారి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహశీల్దార్‌ సరోజినికి వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.