TPT: చిన్నారుల సమగ్ర వికాసానికి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన విద్య అందించాలని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం పూడిపట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ప్రీ-స్కూల్‌ను ఆయన ప్రారంభించారు. ఆటపాటలతో కూడిన విద్యాబోధనతో చిన్నారుల్లో సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'చిన్నారుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది'


