PLD: ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ గడువులో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశాలు పొందవచ్చన్నారు. చదువు మధ్యలో మానేసిన వారు, ఉద్యోగస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఉన్నత విద్యా కోర్సుల్లోనూ ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు


