హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బీజేపీ రాస్తారోకో.. పోలీసులతో వాగ్వాదం

MLG: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. సోమవారం మహిళా కార్యకర్తలతో కలిసి ములుగులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాగ్వాదం జరిగింది.