హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు

KNR: కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం అమ్మవారు బ్రహ్మచారిణి శ్రీ గాయత్రీ దేవి అవతారంలో చంద్రప్రభ, గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లు ప్రత్యేక అలంకారంలో భక్తులను ఆకట్టుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.