హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారికి పట్టు చీరలు సమర్పించిన జిల్లా కలెక్టర్

AKP: అనకాపల్లి గవరపాలెంలోని శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ 10 పట్టుచీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో మహాశివుడికి రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు కలెక్టర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.