హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే శిరీషతో డీఎస్పీ భేటీ

SKLM: పలాస సబ్ డివిజన్‌కు నూతన డీఎస్పీ‌గా నియమితులైన జీవి రమణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలాస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గౌతు శిరీషను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీకి ఎమ్మెల్యే శిరీష శుభాకాంక్షలు తెలిపారు. పలాస‌లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.