హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన.. కాంగ్రెస్ నాయకులు

MHBD: తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన వేల్పుల మల్లమ్మ సోమవారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ నాయకులు మృతురాలి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.3 వేల నగదు, 50 కిలోల బియ్యం అందించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.