హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజంపేటలో సినీ నటి అనసూయ సందడి

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో సినీ నటి అనసూయ సందడి చేశారు. సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనసూయ రాకతో షాపింగ్ మాల్ ప్రాంగణం సందడిగా మారింది. ఆమెను చూసేందుకు అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.