హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణంపై ఫిర్యాదు

KMR: మద్నూర్‌ మండలంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఇవాళ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ప్రజావాణిలో ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. నీటి వినియోగం లేకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారని పేర్కొంటూ, సమగ్ర విచారణ జరిపి నాణ్యతా ప్రమాణాల ప్రకారం పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.