హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కు పరిరక్షణకే కాంగ్రెస్ పోరాటం: ఎమ్మెల్యే

RR: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికల సంఘం వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి, ఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.