SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్చక స్వాములు, వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు రాజన్న స్వామికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులను చెల్లించుకున్నారు. ధర్మ దర్శనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ


