హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాయత్రీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

SRCL: సిరిసిల్ల పట్టణంలోని భవాని సేవ సమితి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ రెండో రోజు గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులు, మహిళలు భక్తిగీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు. భవానీ మాలధారణ స్వాములు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.