హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూగర్భ జలాల పతనం.. రైతులకు బోర్ల కష్టాలు

NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వర్షాలు తగ్గడంతో భూగర్భ జలమట్టాలు పడిపోయి బోర్లు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు కొత్త బోర్లు వేస్తున్నా నీరు పడుతుందన్న భరోసా లేక ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబరులో సగటు భూగర్భ జలమట్టం గతంలో 7.29 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 7.52 మీటర్లకు పడిపోయింది.