హైదరాబాద్: 28°C
వ్యాపారం

బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్లు, విమానాలు, ఔషధాల మాదిరిగానే ఏఐ/ సూపర్ ఇంటెలిజెన్స్ (SI) పైనా కఠినమైన నియంత్రణలు, భద్రతా ప్రమాణాలు అవసరమని తెలిపారు. ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు తగిన చర్యలు అవసరమని చెప్పారు. ఏఐ, SIపై నియంత్రణలో అన్ని ప్రమాదాలను పూర్తిగా తొలగించలేమని ఆయన అభిప్రాయపడ్డారు.