హైదరాబాద్: 28°C
తెలంగాణ

NH-44పై VUP నిర్మాణానికి మోక్షం.. రూ. 78.42 కోట్లు మంజూరు!

ADB: ఎన్‌హెచ్-44పై మావల, ఇచ్చోడ వద్ద వెహికల్ అండర్ పాస్ (VUP) లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. MP గోడం నగేష్ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రమాదాల నివారణకు రూ. 78.42 కోట్లతో VUP నిర్మాణానికి NHAI టెండర్లు ఆహ్వానించింది. ఈ మేరకు MP నగేష్ ప్రధాని మోదీకి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలియజేశారు.