హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మిక గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించిన బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సోమవారం ఈనెల 14న గోదావరిఖనిలో జరగనున్న సింగరేణి కార్మిక గర్జన సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభకు సంబంధించి స్టేజ్, పార్కింగ్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల హక్కులు, వారి సమస్యల పరిష్కారం కోసం జరగనున్న కార్మిక గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.