హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు

SRCL: జిల్లాలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. అక్టోబర్ 21న చందుర్తి మండలం లింగంపేటలోని అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.