NLG: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు సాగునీటి అవసరాల నిమిత్తం ఎన్ఎస్పీ అధికారులు 6,000 క్యూసెక్కుల నీటిని ఈ రోజు విడుదల చేశారు. మిర్యాలగూడ, సాగర్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఊరట లభించనుంది. ఎండుదశలో ఉన్న పంటలకు నీరందనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల


