హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ మరమ్మతులు స్వయంగా చేయొద్దు.. CMD హెచ్చరిక

WGL: దుర్గామాత నవరాత్రి మండపాలు, బతుకమ్మ వేడుకల ప్రాంగణాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తితే ఎవరూ స్వయంగా మరమ్మతులు చేపట్టవద్దని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. అత్యవసర సేవల కోసం సమీప సబ్‌స్టేషన్‌ను లేదా 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. సిబ్బంది వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తారని ఆయన తెలిపారు.