NRPT: దామరగిద్ద మండలం లోకుర్తిలో దళితుల ఇళ్ల కూల్చివేత ఘటనపై డీఎస్పీ లింగయ్య, ఎస్సై నరేష్ విచారణ నిర్వహించారు. కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. తరతరాలుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని బాధితులు కోరారు. విచారణలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
లోకుర్తిలో ఇళ్ల కూల్చివేతపై పోలీసుల విచారణ


