KMR: రాజంపేట పెద్దాయిపల్లి గ్రామానికి చెందిన గాలి మనస్విత (10) ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందింది. నాలుగో తరగతి చదువుతున్న మనస్వితకు అర్ధరాత్రి గుండె నొప్పి రావడంతో కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తెలంగాణ
గుండెపోటుతో పదేళ్ల విద్యార్థిని మృతి


