హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్ఎండీ పోలీస్‌ స్టేషన్‌లో వరుస వివాదాలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ వరుస ఘటనలతో చర్చనీయాంశమైంది. ఇటీవల సీఐ, ఎస్సై, ఏఆర్ కానిస్టేబుల్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయగా,తాజాగా మోటర్ల చోరీ కేసులో విచారణకు వచ్చిన కిన్నెర అజయ్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఈ ఘటనల వెనుక కారణాలు, స్థానిక నేతల ప్రమేయంపై వస్తున్న అనుమానాలపై ఉన్నతాధికారుల విచారణ కీలకంగా మారింది.