KMR: రాజంపేటలో ఇవాళ విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. రోజుకు ఆరు గంటలే విద్యుత్ సరఫరా చేయడంతో పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అంతరాయాలతో బోరు మోటార్లు కాలిపోతున్నాయని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై రైతుల ధర్నా


