హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ముద్దపప్పు బతుకమ్మ

RR: బతుకమ్మ పండుగలో భాగంగా 3వ రోజైన అశ్వయుజ శుద్ధ విదియ రోజును 'ముద్దపప్పు' బతుకమ్మగా జరుపుకుంటారు. ఈరోజు గౌరమ్మకు ప్రధానంగా ముద్దపప్పు, అన్నం, పాలు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ప్రీతికరమైన ఈ నైవేద్యాన్ని సమర్పించి, కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో ఉండాలని మహిళలు భక్తితో ప్రార్థిస్తారు. బతుకమ్మ తయారీలో ముద్దచామంతి పూలను వినియోగించడం స్పెషల్.