హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలంలో నేటి నుంచి దసరా మహోత్సవాలు

BDK: భద్రాచలం రామాలయంలో ఇవాళ్టి నుంచి ఈనెల 21 వరకు విజయ దశమి మహోత్సవ పూజలు నిర్వహించనున్నట్లు EO దామోదర్ రావు తెలిపారు. ప్రతీ రోజు అభిషేకం, కుంకుమార్చన నిర్వహిస్తారు. సామూహిక రామాయణ పారాయణం, ప్రవచనం ఉంటుంది. ఈ వేడుకల్లో మొదటి రోజున అమ్మవారు ఆదిలక్ష్మీ అలంకారంలో దర్శనమిస్తారు. గోత్రనామాలతో చేయించదలచిన భక్తులు ఒక్కో అలంకారం నిమిత్తం రూ. 1000 రుసుము చెల్లించాలని సూచించారు.