హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒరిగిన విద్యుత్ స్తంభాలు.. సరఫరాలో అంతరాయం

SRD:​ నారాయణఖేడ్ మండలం వెంకటాపురం శివారులో విద్యుత్ స్తంభాలు ఒకవైపు ఒరిగిపోవడంతో సరఫరాలో తరచూ అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎప్పుడు కూలుతాయోనని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు వాలాయి. పెద్ద ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి, వెంటనే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.